బెండ సాగు చేయాలనుకుంటున్నారా.. ఈ నేలలు అనుకూలం!

82చూసినవారు
బెండ సాగు చేయాలనుకుంటున్నారా.. ఈ నేలలు అనుకూలం!
కూరగాయలకు మార్కెట్‌లో 365రోజులూ డిమాండ్‌ ఉంటుంది. అలాగే, బెండ సాగు కూడా అన్ని కాలాల్లోనూ అనుకూలమై, రైతులకు లాభాలను అందిస్తుంది. ఇక బెండ సాగుకు ఉదజని సూచిక 6.0 నుంచి 6.8 వరకు ఉండే నేలలు అనుకూలంగా ఉంటాయి. వదులైన, మెత్తని, బాగా ఆరిన ఇసుక నేలలు కూడా అనుకూలమే. సారవంతమైన ఒండ్రు, నల్లరేగడి, గరుప నేలల్లో కూడా బెండ సాగు చేసి అధిక దిగుబడి సాధించొచ్చు. ఇక క్షార స్వభావం ఉన్న నేలల్లో బెండ సాగు చేయడం మంచిది కాదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్