TG: విహారయాత్రకు వెళ్లిన వైద్యుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనన్యరావు (27) మృతిచెందారు. అనన్యరావు, మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు నీటిలో దూకి ఈత కొడుతూ గల్లంతయ్యారు. నదిలో నుంచి రెస్క్యూ టీమ్ ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.