తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అంటే ప్రజలకు ఓ సెంటిమెంట్.. ఓ భరోసా. మధ్యలో టీఆర్ఎస్‌ను కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకత్వాన్ని మారిస్తేనే పార్టీకి పూర్వవైభవం వస్తుందని టాక్ నడుస్తోంది. ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను వేరే వాళ్లకి అప్పగిస్తే మరోసారి గులాబీ హవా కొనసాగుతుందని కార్యకర్తల నుంచి వినిపిస్తున్న మాట.