కుక్కకు చిత్ర హింసలు పెట్టి కొట్టారు (వీడియో)

1070చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. దానికి ఈ దారుణ ఘటనే నిదర్శనంగా కనిపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఓ కుక్కను అత్యంత దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన వీళ్లసలు మనుషులేనా అనిపించేలా ఉంది. ఓ కుక్క మెడకు తాడు కట్టి అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నోయిడాలోని గోమతీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్