ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఈ నెల 4వ తేదీ (శనివారం) రోజున రాత్రి 09:29 గంటలకు ప్రారంభమైంది. ఇది ఈ నెల 5వ తేదీ (ఆదివారం) రాత్రి 11:58 గంటలకు ముగుస్తుంది. మాఘ పౌర్ణమి రోజున కొన్ని పనులను చేయకపోవడమే మంచిది. ఒకవేళ పొరపాటున ఈ పనులు చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహించే అవకాశం ఉంది. మాఘ పౌర్ణమి రోజున ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పౌర్ణమి తిథికి అధిపతి చంద్రుడు. చాలామంది ఈరోజు పౌర్ణమి వ్రతాన్ని ఆచరిస్తారు. జ్యోతిష్యం ప్రకారం లక్ష్మిదేవి, చంద్రుని ఆశీస్సులతో అదృష్టం వరిస్తుంది.
ఈరోజు స్నానం చేయకపోతే విష్ణువు, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. వీలైతే గంగాస్నానం లేదా నదీ స్నానం చేయాలి. లేదా ఇంట్లో గంగాజలం చేర్చిన నీటితో స్నానం చేయాలి.
మాఘ పౌర్ణమి రోజున విష్ణు దేవునికి సంబంధించిన వస్తువులను అగౌరవపరచే పనులు చేయవద్దు. విష్ణువును అగౌరవపరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అని చెబుతారు.
మాఘ పౌర్ణమి రోజున అరటి మొక్క, తులసి మొక్క, ఉసిరి చెట్టు, రావి, పారిజాతం మొదలైన వాటిని రక్షించాలి.
ఈ రోజున ఆవును చంపవద్దు లేదా ఆవును హింసకు గురి చేయవద్దు. ఆవును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏరోజు కూడా ఆవును చంపవద్దు. మాఘ పౌర్ణమి రోజున గోవులకు సేవ చేస్తే పుణ్యం లభిస్తుందని చెబుతుంటారు.
మాఘ పౌర్ణమి రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి.
(పైన ఇవ్వబడినవి కేవలం మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మీ ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వబడినవి)