కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. అయితే అన్ని సమయాల్లోనూ దానం చేయడం మంచిది కాదని పేర్కొంటున్నారు పండితులు. తల్లిదండ్రులు, గురువులు అప్పగించిన పని పూర్తి చేయకుండా దానం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నట్లు వెల్లడించారు. అలాగే తల్లిదండ్రుల కర్మకాండల క్రతువులను నిర్వహించే క్రమంలో వాటిని పూర్తి చేయకుండా ఎలాంటి దానాలు కూడా చేయకూడదని అంటున్నారు. అలాగే, చాలా సందర్భాల్లో వారాలు, పండుగల సమయాల్లోనూ మనం దానాలు చేయం.