వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రస్తుతం చలి తక్కువగానే ఉంది. డిసెంబరు నెల ప్రవేశించినా అనేక ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి ఏమీ లేదు. నవంబరులో అనేక ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఉత్తర, వాయవ్య, తూర్పు భారతంలో చలిగాలులు వీచే వాతావరణం ఏర్పడలేదు. ఇంచుమించు అటువంటి వాతావరణమే డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకూ కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేసింది.