‘గుర్తు తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు': ప్రజలకు పోలీసుల హెచ్చరిక

81చూసినవారు
‘గుర్తు తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు': ప్రజలకు పోలీసుల హెచ్చరిక
గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ ను ఎట్టిపరిస్థితుల్లో లిఫ్ట్ చేయొద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అలాంటి అపరిచిత ఫోన్ కాల్స్ ను లిఫ్ట్ చేస్తే ఎలాంటి చిక్కుల్లో పడుతామో తెలిసేలా అవగాహన వీడియోను షేర్ చేశారు. “అపరిచిత నెంబర్ల వీడియో కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్లు నగ్నంగా ఉండి వీడియో రికార్డు చేస్తారు. ఆ తర్వాత ఆ వీడియోతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా హింసిస్తారు, జాగ్రత్త" అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్