క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన యోగ్‌రాజ్‌పై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన్నుంచి సచిన్ కుమారుడు అర్జున్‌ను దూరంగా ఉంచాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేశారు. లేకపోతే యువకుడి భవిష్యత్తు నాశనమైపోతుందని కామెంట్లు చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్‌లో ఆడిన తొలి తండ్రీకుమారులుగా సచిన్-అర్జున్ ఘనత సాధించిన సంగతి తెలిసిందే.