రాయుడిని ట్రోల్ చేయకండి: పీటర్సన్

72చూసినవారు
రాయుడిని ట్రోల్ చేయకండి: పీటర్సన్
మాజీ క్రికెటర్ అంబటి రాయుడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ దారుణంగా పెరిగాయి. కామెంటేటర్‌గా ఉన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సైతం ‘జోకర్‌’ (సరదాగా ఉండే వ్యక్తివి అంటూ) అని రాయుడిని సంభోదించాడు. దీంతో రాయుడిపై మరింత ట్రోలింగ్‌ మొదలవగా, పీటర్సన్ నేరుగా స్పందించారు. ‘‘ట్రోలింగ్‌ చేసే బ్యాచ్ ఇకనైనా దానిని ముగించాలి. నేను, అంబటి రాయుడు సరదాగా మాట్లాడుకున్నాం. రాయుడిపై విమర్శలు చేయవద్దు’’ అంటూ పోస్టు పెట్టారు.

సంబంధిత పోస్ట్