పాములకు రెండు నాలుకలకు కారణం ఇదే

577చూసినవారు
పాములకు రెండు నాలుకలకు కారణం ఇదే
పురాణాల ప్రకారం గరుత్మంతుడు తన తల్లి వినతను దాస్యం నుంచి విముక్తి కలిగించాలని అమృత కలశాన్ని తీసుకెళ్లి దర్భలపై పెడతాడు. అమృత కలశాన్ని చూసిన పాములన్నీ దాన్ని సేవించడానికి ముందు స్నానమాచరించాలని వెళ్లగా, ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని ఎత్తుకుపోతాడు. తిరిగి వచ్చిన సర్పాలు జరిగింది గ్రహించి.. దర్భలని నాకుతాయి. దర్భ చాలా పదునుగా ఉండడం వల్ల పాముల నాలుకలు రెండుగా చీలిపోయి, పాములకు రెండునాలుకలు శాశ్వతం అయిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్