2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ప్రజలను ఆకర్షించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేశారు. తాను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మెక్‌డీలో పనిచేశానని ప్రచారాలు చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కి ట్రంప్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.