'డ్రాగన్ బాల్' సృష్టికర్త అకిరా మృతి

65చూసినవారు
'డ్రాగన్ బాల్' సృష్టికర్త అకిరా మృతి
ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన 'డ్రాగన్ బాల్' సిరీస్ సృష్టికర్త అకిరా తోరియామా(68) మరణించారు. ఆయనకు మార్చి 1న మెదడులో రక్త స్రావం జరిగింది. జపనీస్ కామిక్స్ లో అత్యధికంగా అమ్ముడైన వాటిలో డ్రాగన్ బాల్ ఒకటిగా నిలిచింది. కాగా ఆయన మృతితో మరోసారి అందరూ తమ చిన్నతనంలో డ్రాగన్ బాల్ చూసిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు. తమ బాల్యాన్ని మధురంగా మార్చినందుకు తోరియామాకు థాంక్స్ చెబుతూ నివాళులర్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్