మజ్జిగలో చియా విత్తనాలను వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్, చియా విత్తనాలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ రెండింటి కలయిక వల్ల గుండె సమస్యలు దరిచేరవు. ఇంకా ఎముకలు బలపడతాయి. శరీరంలో వేడి తగ్గి చలువ వస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.