భార్యల వేధింపులతో భర్తలు సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్, ఢిల్లీ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా ఘటనలు మరవకముందే గుజరాత్‌లో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బొటాడ్ జిల్లాకు సురేష్ సతాదియా(39) గత డిసెంబర్ 30న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు తన మరణానికి భార్యనే కారణమని, ఆమెను శిక్షించాలని సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేశాడు. దీంతో పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.