తమ ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఆయన చేస్తున్న ఆరోపణలు నిజమైతే తగిన ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. తగిన రుజువులు లేకుండా తమపై అసంబద్ధమైన ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాటిని ఆయన నిరూపించే వరకు వదిలిపెట్టము’ అని ముఖ్యమంత్రి అన్నారు.