రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వీయ తప్పిదాలు కూడా కొన్నిసార్లు ఘోర ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ఈ నెల 1న జరిగిన అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు బైకుపై వెళుతూ ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. అయితే, వారికి పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎలా అదుపుతప్పిందో వారి వాహనం ఒక్కసారిగా నడిరోడ్డుపై పడిపోయింది.