ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కూల్ డ్రింక్స్‌లో పెద్ద మొత్తంలో చక్కెర, కృత్రిమ చక్కెరను ఉపయోగిస్తారు. ఇది ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.