ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు, అసలైన భూ యజమానులకు మేలు జరిగేలా జనవరి 20 నుంచి భూముల రీసర్వే చేపట్టనుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అలాగే 22ఏ భూములపై నిషేధం ఎత్తివేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో 22-ఎ జాబితాలో అక్రమంగా ప్రజల భూములను చేర్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే భూముల రీ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.