బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో ఎపిలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఇటు తెలంగాణలో ఈ రోజు , రేపు( గురువారం) పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ప్రధానంగా తూర్పు, ఈశాన్య దిశల నుండి ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే రెండు మూడు రోజులు అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గుర్తించదగిన స్థాయికి పడిపోతాయని హెచ్చరించింది.