సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి, ప్యారా నగర్ గ్రామాల శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే ఈ డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నల్లపల్లి గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపైకి పెద్ద ఎత్తున గేదెలను తీసుకొచ్చి ‘డంపింగ్ యార్డ్ వద్దు.. మా కడుపు కొట్టొద్దు' అని ర్యాలీ నిర్వహించారు.