మెట్రో రైలు విస్తరణ.. చారిత్రక కట్టడాలకు ముప్పు!

84చూసినవారు
మెట్రో రైలు విస్తరణ.. చారిత్రక కట్టడాలకు ముప్పు!
హైదరాబాద్ నగరంలో పలు చారిత్రక కట్టడాలను పరిగణలోకి తీసుకోకుండా మెట్రో రైలు నిర్మాణాలు చేపడుతున్నారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. CS, మెట్రో రైలు ఎండీని ప్రతివాదులుగా చేరుస్తూ APWF పిల్ వేసింది. పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణం వల్ల.. చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్, పురాణాహవేలీ, మొఘల్ పుర సమాధులు వంటి చారిత్రక కట్టడాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. అందువల్ల డిజైన్ లో మార్పులు చేయాలని APWF కోరింది.

సంబంధిత పోస్ట్