త్వరలో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లను ఉపయోగించుకోనుంది. ఈ మేరకు నూతన సోషల్ మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్‌ఫ్లూయెన్సర్లు నెలకు రూ.8 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. అయితే ఈ పాలసీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.