అరుణాచల్ ప్రదేశ్‌లో శనివారం ఉదయం
భూకంపం సంభవించింది. రిక్కర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలాజీ(NCS) వెల్లడించింది. భూఉపరితలానికి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో పేర్కొంది.
భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ప్రభుత్వం తెలిపింది.