వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు చాలా మేలు చేస్తుంది. ఎముకలను, కండరాలను ధృడంగా, అలాగే బరువును అదుపులో ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా, గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ, పెరుగును ఎప్పుడూ కూడా రాత్రివేళల్లో కాకుండా ఉదయం కానీ లేదా మధ్యాహ్న సమయంలో తినాలని నిపుణులు సూచిస్తున్నారు.