బరువు తగ్గాలని చాలామంది తక్కువగా తింటుంటారు. కానీ ఇది సురక్షితం కాదని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి సరిపడినంత ఆహారం, పోషకాలు తినకపోవడం వల్ల శరీరంలో కొత్త సమస్యలు మొదలవుతాయి. చాలా తక్కువ కేలరీలు తినడం కండరాల నష్టానికి దారితీస్తుంది. తక్కువగా తినడం వల్ల జీవక్రియ రేటును తగ్గిస్తుంది. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంది. శరీరంలో పోషకాల లేమి వల్ల శారీరక విధులకు అంతరాయం కలుగుతుంది. పోషక లోపం హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది.