ఎడ్యుకేషన్ పాలసీ మతతత్వాన్ని పెంపొందిస్తుంది: సోనియా గాంధీ

60చూసినవారు
ఎడ్యుకేషన్ పాలసీ మతతత్వాన్ని పెంపొందిస్తుంది: సోనియా గాంధీ
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రీకరణ, వాణిజ్యీకరణ, మతతత్వీకరణను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ఉపయోగిస్తోందని అన్నారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియా పత్రిక కోసం 'ది త్రీ సీస్ దట్ హంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ టుడే' పేరుతో రాసిన ఆర్టికల్‌లో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆమె తప్పుబట్టారు. రాజకీయ స్వలాభం కోసం కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోంది అంటూ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్