IPL-2025లో భాగంగా వాంఖడే వేదికగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ (3) మరోసారి నిరాశపర్చాడు. దీపక్ చాహర్ వేసిన 5.4 ఓవర్‌కు వికెట్‌కీపర్ రికెల్‌టన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 41/4. రింకు సింగ్ (0), రఘువంశీ (25) క్రీజులో ఉన్నారు.