తెలంగాణ రైతుల అభివృద్ధికి కృషి: గవర్నర్‌

60చూసినవారు
తెలంగాణ రైతుల అభివృద్ధికి కృషి: గవర్నర్‌
TG: తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఇవాళ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్‌ అన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. ‘మా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ. రాష్ట్రానికి రైతులే ఆత్మ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం’ అని గవర్నర్‌ అన్నారు.

సంబంధిత పోస్ట్