ప్రజా రవాణా వ్యవస్థను అత్యుత్తమంగా మార్చేందుకు కృషి: రాష్ట్రపతి

79చూసినవారు
ప్రజా రవాణా వ్యవస్థను అత్యుత్తమంగా మార్చేందుకు కృషి: రాష్ట్రపతి
భారతదేశ ప్రజా రవాణా వ్యవస్థను ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 10 ఏళ్లలో మెట్రో 21 నగరాలకు చేరుకుందని, వందే మెట్రో వంటి అనేక పథకాల్లో పనులు కొనసాగుతున్నాయన్నారు. 508 కి.మీల అహ్మదాబాద్-ముంబై హై-స్పీడ్ కారిడార్‌లో దేశంలోనే మొదటి సారిగా బుల్లెట్ రైలు పరుగులు తీయనుందన్నారు. రైలు 320 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్