దేశంలో 8 శాతం తగ్గిన గృహ విక్రయాలు

80చూసినవారు
దేశంలో 8 శాతం తగ్గిన గృహ విక్రయాలు
దేశంలో గృహ విక్రయాలు భారీగా తగ్గాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం విక్రయాలు క్షీణించాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికం (Q1)లో 1,30,370 గృహాలు అమ్ముడవగా.. రెండో త్రైమాసికం (Q2)లో ఆ సంఖ్య 1,20,340కు తగ్గినట్లు పేర్కొంది. ఇళ్ల విక్రయాల్లో తగ్గుదల నమోదుకావడం రెండేళ్లలో ఇదే తొలిసారి అని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అన్‌రాక్‌ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్