AP: నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పేర్లను సిఫార్సు చేసేందుకు కొంత మంది నేతలు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21 ఆలయాలకు చైర్మన్ల నియామకం చేపడతామని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల కోసం దాదాపు 60 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. మొదటిసారి పదవి రాకపోయినా రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.