దక్షిణ కొరియాలో నేడు ఎన్నికలు

75చూసినవారు
దక్షిణ కొరియాలో నేడు ఎన్నికలు
దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 300 స్థానాలున్న పార్లమెంట్‌లో 254 స్థానాలను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 46 స్థానాలను చిన్నాచితక పార్టీలకు వాటికి లభించిన ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పీపుల్‌ పవర్‌ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ పోటీ పడుతున్నాయి. మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్