రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా కొండా సురేఖను వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. నటి సమంత మీద అనరాని మాటలు అని నేను ఏం మాట్లాడానో తెలియదు అంటే సరిపోద్దా అని అన్నారు. '72 గంటలు సమయం ఇస్తున్నా. ఆ లోపు కొండా సురేఖ రాజీనామా చెయ్యాలి. లేదంటే లీగల్‌గా ప్రొసీడ్ అవుతా' అని పాల్ తెలిపారు.