TG: కరీంనగర్ డీఈవో ఆఫీస్‌లో విషాదం చోటుచేసుకుంది. అటెండర్‌గా పనిచేస్తున్న రవిందర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాంపూర్‌కు చెందిన వాడిగా తోటి ఉద్యోగులు తెలిపారు. అయితే ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.