"మా కుటుంబ పరిస్థితుల్ని ఎలాగైనా మార్చాలనుకుని నేనెంతో ఇష్టపడ్డ మోడలింగ్‌పై దృష్టి పెట్టా. ‘మిస్ గోరఖ్‌పూర్’ అందాల కిరీటం గెలిచాక నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. దాంతో ఢిల్లీ వెళ్ళా.. మోడలింగ్ అవకాశాలు కూడా పెరిగాయి. కొన్ని యాడ్స్‌లోనూ నటించాను. ఇలా కెరీర్‌లో నిలదొక్కుకునే సమయంలోనే కరోనా లాక్‌డౌన్ నా కలలకు అడ్డు పడింది. ఆ సమయంలో అవకాశాల్లేకపోవడంతో తిరిగి ఇల్లు చేరా." అని సిమ్రన్ తెలిపారు.