కంది, కూరగాయల పంటకు ఆశించే తెగుళ్లు.. నివారణ

6849చూసినవారు
కంది, కూరగాయల పంటకు ఆశించే తెగుళ్లు.. నివారణ
కంది:
-ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్తోరా ఎండు తెగులు ఆశించడానికి అనుకూలం. తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రా. కాపర్-ఆక్సీ-క్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి.
కూరగాయలు:
-కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్లైతే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
-ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలము. తెగులు నివారణకు 1 గ్రా. కార్బండజిమ్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిపిచారీ చేయాలి.

సంబంధిత పోస్ట్