పటాకుల పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు మృతి

78చూసినవారు
పటాకుల పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు మృతి
తమిళనాడులోని సాయినాథ్ పటాకుల ఫ్యాక్టరీలో ఇవాళ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పేలుడు ధాటికి నాలుగు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుంటే వారిని కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాణసంచా ఫ్యాక్టరీలోని ముడిసరుకు నిల్వ చేసే గదిలో పేలుడు సంభవించిందని, సహాయక చర్యలు పూర్తయ్యాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్