నాగాలాండ్‌లో ‘అఫ్సా’ చట్టం పొడిగింపు

81చూసినవారు
నాగాలాండ్‌లో ‘అఫ్సా’ చట్టం పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగాలాండ్‌లోని 8 జిల్లాలు, ఐదు జిల్లాల పరిధిలోని 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో ఆరు నెలల పాటు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా)ను పొడిగించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఇది అమల్లో ఉండనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దిమాపూర్, నియులాండ్, చుమౌకెడిమా, మోన్, కిఫిరే, నోక్లక్, ఫేక్, పెరెన్ జిల్లాల్లో అఫ్సాను పొడిగించినట్టు తెలిపింది.

సంబంధిత పోస్ట్