సీఎం చంద్రబాబుపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి 6 నెలలు అయిందని అన్నారు. మరీ మీ సూపర్ సిక్స్ ఎక్కడ? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ విధివిధానాలను ఇంతవరకు ప్రకటించలేదని నిలదీశారు. సూపర్ సిక్స్ ప్రకటన చేసే నాటికి గత సీఎం జగన్ రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారని.. ఈ విషయం చంద్రబాబుకి తెలుసని గుర్తుచేశారు.