పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేత కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై బన్సీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానుండడంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఈ పని ఎవరు చేశారో గుర్తించే పనిలో ఉన్నారు.