తెలుగు రాష్ట్రాలను ఫెంగల్ తుఫాను వణికిస్తోంది. దీంతో వాతావరణం సరిగా లేని కారణంగా విశాఖపట్నం నుంచి వెళ్లే పలు విమానాలు రద్దయ్యాయి. చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 3 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలను తుఫాను కారణంగా రద్దయ్యాయి.