తిరిగి రప్పించాలని వేడుకుంటున్న కూలీల కుటుంబ సభ్యులు

3150చూసినవారు
పొట్టకూటి కోసం వలస వెళ్లిన వలస జీవులు అన్నమో రామచంద్రా అంటూ జన్మభూమి కి రావడానికి పరితపిస్తూ దేశం వచ్చేలా సహకరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇరాక్ లోని ఖుర్దిస్తాన్ రాష్ట్ర రాజధాని హెర్బిల్ పట్టణంకి వలస వెళ్లి మోసపోయి ఇంటికి రాలేని స్థితిలో ఉన్న 17 మంది తెలంగాణ వాసులను తమ సొంత గ్రామాలకు చేర్చాలని కోరుతున్నారు తెలంగాణ నుండి ప్రస్తుతం ఎర్బిల్ పట్టణంలో చిక్కుకున్న 17 మంది వలస కూలీల లో జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన దుర్గం చంద్రయ్య ఇంటికి మీడియా ప్రతినిధులు వెళ్లి వివరాలు తెలుసుకో గా వారి తల్లి మీడియాతో మాట్లాడుతూ తమ కొడుకు పొట్టకూటికోసం ఏజెంటు మాటలు నమ్మి సంవత్సరంన్నర క్రితం బయటి దేశం వెళ్లాడని అక్కడ పని లేక గత కొన్ని నెలలుగా పస్తులు ఉంటున్నాడని చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని పక్కవారి ఫోన్ తో మాకు ఫోన్ చేసి బాధపడుతున్నాడని అన్నారు తెలంగాణ గవర్నమెంట్ కెసిఆర్ గారు ఎలాగైనా దయతలచి మా అబ్బాయిని రప్పించాలని వేడుకున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్