సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సోషల్ మీడియాలోనూ ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత, స్టార్ నటుడిని అరెస్ట్ చేస్తారా? అంటూ ఫైరవుతున్నారు.