రైతు రుణమాఫీ మళ్ళీ వాయిదా పడుతుంది: ఎన్వీ సుభాష్

72చూసినవారు
రైతు రుణమాఫీ మళ్ళీ వాయిదా పడుతుంది: ఎన్వీ సుభాష్
నేడు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మీడియాతో మాట్లాడుతూ 'సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తారని నమ్మకం లేదని, దీనిని డిసెంబర్ 9కి వాయిదా వేస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. రుణమాఫీకి రూ.40 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో రైతులకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ కేవలం తన కుర్చీని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్