TG: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. తెలకపల్లి మండల కేంద్రంలోని బరోడా బ్యాంక్ ఎదుట ఓ రైతు తన బైక్‌ను తగలబెట్టాడు. గోలగుండం గ్రామానికి చెందిన చందు అనే రైతు.. రుణమాఫీ కాలేదని మనస్థాపానికి గురై బ్యాంకు ఎదుట తన బైక్‌పై పెట్రోల్ పోసి కాల్చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.