నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కోదాడ, నల్గొండ రహదారులపై రైతుల రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రైస్ మిల్లర్స్ సిండికేట్ గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపించారు. మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.