నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఫాస్టాగ్ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం మూడు నుంచి ఐదేండ్ల క్రితం జారీచేసిన ట్యాగ్‌లకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా తప్పనిసరిగా అప్‌డేట్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఐదేండ్ల కంటే పాతవైన ఫాస్టాగ్‌లను మార్చుకోవాల్సి ఉంటుంది. యజమానులు తమ ఫాస్టాగ్‌లను రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్లకు డెడ్‌లైన్‌లోగా లింక్ అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది.