మాజీ మంత్రి పేర్ని నాని భార్య ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కృష్ణా జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణిపై మచిలీపట్నం తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం జయసుధ జిల్లా కోర్టును సంప్రదించారు. ఈ కేసులో వాదనలు విన్న బందరు కోర్టు విచారణను రేపటికి వాయిదా వేశారు.