AP: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. 21 అంశాలపై క్యాబినెట్ అజెండా రూపొందించగా, వాటిపై మంత్రులు చర్చిస్తున్నారు. సీఆర్డీఏ అనుమతించిన పనులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వీటితో పాటు వివిధ పరిశ్రమలకు భూకేటాయింపులపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అటు, అమరావతిలో భాగస్వామ్యం కావాలని సీఆర్డీఏ జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలకు లేఖల ద్వారా ఆహ్వానం పలికింది.